ఆంధ్రప్రదేశ్లో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ నిర్ధారణ
- తనకు కరోనా సోకిందన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
- ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉన్నానని వ్యాఖ్య
- తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులకు కూడా వైరస్ సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో మరో ఎమ్మెల్యే కొవిడ్-19 బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అయితే, ప్రజలెవరూ అధైర్యపడవద్దని, తాను కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. తాను కోలుకునే వరకు తన వద్దకు ఎవరూ రావద్దని కోరారు.
ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. కరోనా సోకినప్పటికీ స్థానిక నేతలతో పాటు అధికారుల సాయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.