సోనియా ప్రకటన తర్వాత మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ స్పందన!
- కాంగ్రెస్ లో కాక రేపుతున్న సీనియర్ల లేఖ
- లేఖ దురదృష్టకరమన్న మన్మోహన్
- లేఖలో ఉపయోగించిన పదాలు దారుణంగా ఉన్నాయన్న ఆంటోనీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలను కొనసాగించలేనని సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత పార్టీ సీనియర్లైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగాలని ఆయన విన్నవించారు. సోనియాకు కొందరు సీనియర్లు లేఖ రాయడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ని బలహీనపరచడమంటే పార్టీని బలహీనపరచడమేనని చెప్పారు.
మన్మోహన్ సింగ్ తర్వాత ఏకే ఆంటోనీ మాట్లాడుతూ, లేఖలో ఉపయోగించిన పదాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో పార్టీకి సోనియాగాంధీ చేసిన సేవల గురించి చెప్పారు. సోనియాకు ఇష్టం లేని పక్షంలో పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ స్వీకరించాలని కోరారు.