వెనక్కి తగ్గిన చైనా.. అమెరికాతో ఒప్పందంపై ముందడుగు
- తొలిదశ వాణిజ్య ఒప్పందంపై చర్చలు
- ఫోనులో మాట్లాడుకున్న అమెరికా-చైనా విదేశాంగ మంత్రులు
- దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందం
అమెరికా-చైనా మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. వాణిజ్య ఒప్పందం, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఇటీవల ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఇరు దేశాలు తొలిదశ వాణిజ్య ఒప్పందంలో ముందడుగు వేయడం గమనార్హం.
తాజాగా, అమెరికా-చైనా విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. ఈ చర్చల్లో అమెరికా డిమాండ్లకు చైనా ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇటీవల చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్ వెనక్కు తగ్గి అమెరికాతో చర్చలు జరిపింది.
తొలిదశ వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది జనవరిలోనే సంతకాలు చేసినప్పటికీ అనంతరం చైనాలో కరోనా వైరస్ గురించిన వార్తలు బయటకు రావడం, అమెరికాలో తీవ్ర స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం వంటి పరిణామాలు ఆ ఒప్పందాన్ని ముందుకు కదలనివ్వలేదు.
ఇటీవల చైనా కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడుతూ ఆంక్షలు విధించడానికి మొగ్గు చూపుతుండడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలహీనమయ్యాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధిక సుంకాలు విధించడంతో చైనా కూడా అదే పని చేసింది. చైనాతో అన్ని వ్యాపార సంబంధాలకు గుడ్ బై చెబుతామని ట్రంప్ అన్నారు. దీంతో తొలిదశ ఒప్పందాలపై చైనా వెనక్కు తగ్గింది.