ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రేలియాలో వివాదం... వాడవద్దంటున్న ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు!
- గర్భస్రావం చేసిన శిశువు పిండ కణాలను వాడారు
- ఇది నిషేధించబడిన పద్ధతంటూ ముస్లిం మతపెద్ద వీడియో
- తయారీ విధానాన్ని ప్రశ్నిస్తున్న క్రైస్తవ మత పెద్దలు
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 'హరామ్' (నిషేధించబడినది) అని, దాన్ని ముస్లింలు వాడవద్దని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మతపెద్ద ముస్లింలను కోరడం కలకలం రేపుతోంది. ఇక్కడి ఓ సూఫీ ఖలీఫా, ఈ వ్యాక్సిన్ ముస్లింలు వాడవద్దంటూ ఓ వీడియోను విడుదల చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. వ్యాక్సిన్ తయారు చేసిన పద్ధతి ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. నిషేధించబడిన పద్ధతుల్లో దీన్ని తయారు చేశారని, 1970 లలో గర్భస్రావం చేయబడిన శిశువు యొక్క పిండ కణాలను వీరు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి, వ్యాక్సిన్ లో వాడారని ఆయన ఆరోపించారు.
పలువురు ముస్లింల శరీరాలపైనా వ్యాక్సిన్ ను ప్రయోగించారని, ఇది సిగ్గు చేటని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యాక్సిన్ ను తయారు చేసిన ఆస్ట్రాజెనికాతో ఆస్ట్రేలియా సర్కారు డీల్ కుదుర్చుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇక పలువురు క్రైస్తవ మతపెద్దలు కూడా ఈ వ్యాక్సిన్ తయారీ విధానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సిడ్నీ ఆర్చ్ బిషప్ ఆంటోనీ ఫిషర్, ప్రధాని స్కాట్ మారిసన్ కు ఏకంగా ఓ లేఖ రాశారు. ఇదే లేఖలో ఏంజలికన్, గ్రీక్ సంప్రదాయ మత పెద్దలు కూడా సంతకాలు చేయడం గమనార్హం.