మరికాసేపట్లో అధికారిక నివాసానికి ప్రణబ్ పార్థివదేహం
- నిన్న తుదిశ్వాస విడిచిన ప్రణబ్
- తొలి అంజలి ఘటించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్
- 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహం మరికాసేపట్లో ఆయన అధికారిక నివాసానికి చేరుకోనుంది. ప్రణబ్ పార్థివదేహానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలుత అంజలి ఘటించనున్నారు. అనంతరం 10-11 మధ్య రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు కేంద్రమంత్రులు, వీఐపీలు నివాళులు అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతి ఇస్తారు. ఒంటి గంటలకు సైనిక గౌరవ వందనం అనంతరం 2 గంటలకు లోధి గార్డెన్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.