ఈఎస్ఐలో అక్రమాల పేరుతో నన్ను అక్రమ కేసులో ఇరికించారని ప్రతి ఒక్కరూ గుర్తించారు: అచ్చెన్నాయుడు

  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడి
  • నిజాయతీ తన ధైర్యం అంటూ ట్వీట్
  • ప్రజాక్షేమమే తన లక్ష్యం అంటూ వ్యాఖ్యలు
మాజీమంత్రి అచ్చెన్నాయుడు ఇటీవలే ఈఎస్ఐ స్కాంలో బెయిల్ పై విడుదలయ్యారు. చాలాకాలం తర్వాత ట్విట్టర్ లో మళ్లీ దర్శనమిచ్చారు. ఈఎస్ఐలో అక్రమాల పేరుతో నన్ను అక్రమ కేసులో ఇరికించారని ప్రతి ఒక్కరూ గుర్తించారు అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. తన అక్రమ అరెస్టును అందరూ ఖండించారని, తాను అనారోగ్యంగా ఉంటే కోలుకోవాలని ప్రార్థించారని తెలిపారు.

ప్రభుత్వం తప్పులు నిలదీయడమే తాను చేసిన తప్పయితే ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటానని అచ్చెన్న స్పష్టం చేశారు. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను ప్రశ్నిస్తూనే ఉంటానని ఉద్ఘాటించారు. "నిజాయితీ నా ధైర్యం, సత్యం నా ఆయుధం, ప్రజాక్షేమమే నా లక్ష్యం" అన్నారు అచ్చెన్న.


More Telugu News