గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ
- నాదెండ్ల ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
- టీడీపీ వర్గీయుల ఇళ్ల ముందు బాణసంచా కాల్చిన వైసీపీ శ్రేణులు
- ఘర్షణలో నలుగురికి గాయాలు
ఏపీలో పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి సంభవించింది. నాదెండ్ల ఎస్సీ కాలనీలో ఇరు పార్టీలకు చెందిన వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణుల ఇళ్ల ముందు వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చాయి. ఈ క్రమంలో బాణసంచా పేలి పక్కనున్న ఇళ్లపైన, గడ్డివాములపైనా పడి మంటలు చెలరేగాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన నలుగురు గాయపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి పుల్లారావు స్పందిస్తూ వైసీపీ కవ్వింపులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని చెప్పారు. కావాలనే టీడీపీ శ్రేణుల ఇళ్ల ముందు బాణసంచా కాల్చి అల్లర్లు చేయాలనుకున్నారని విమర్శించారు.