తెలంగాణ‌లో రిజిస్ట్రేష‌న్ల శాఖ ప్ర‌క్షాళ‌నపై ఏపీ‌ మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు స్పంద‌న‌

  • ఇది చాలా మంచి ప్రక్రియ
  • తహసీల్దార్ వద్దనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్
  • వ్యవసాయ భూముల కొనుగోలు, విక్రయాలు సులభతరం
  • సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం
తెలంగాణ‌లో  రిజిస్ట్రేషన్ల‌ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వీఆర్వో లు వారి వద్ద ఉన్న రికార్డులను తహసీల్దార్లకు అందజేశారు. ఇందులో 1950 ఖాస్రా పహాణీ నుంచి ఐబీ, పహాణీలు, మ్యూటేషన్‌ రిజిస్ట‌ర్లు, సాదాబైనామా, నాలా సంబంధిత ద‌స్త్రాలు, గ్రామాల‌‌ మ్యాపులు, టిప్పన్‌ కాపీలు, రసీదు పుస్తకాలు వంటివన్నీ ఉన్నాయి. ఇక‌పై త‌హ‌సీల్దార్ల వ‌ద్దే వ్య‌వ‌సాయ భూముల రిజిస్ట్రేష‌న్లు జ‌రగ‌నున్నాయి. ప్ర‌స్తుతానికి అన్ని రిజిస్ట్రేష్ల‌ను బంద్ చేశారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు ట్విట్ట‌ర్ లో స్పందించారు. "ఇది చాలా మంచి ప్రక్రియ. తహసీల్దార్ వద్దనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రెండు కార్యక్రమాలు జరిగేటట్లు అయితే, వ్యవసాయ భూముల కొనుగోలు విక్రయాలు సులభతరం అవుతాయి. సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది" అని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.


More Telugu News