క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించని ఖాతాదారులకు ఊరట.. మరింత గడువు ఇవ్వనున్న ఎస్బీఐ
- ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులకు ఇది శుభవార్తే
- ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణ పథకం ఎంచుకునే అవకాశం
- ఏది ఎంచుకున్నా వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉంటుందన్న ఎస్బీఐ
కరోనా కారణంగా మారటోరియం తీసుకుని, గడువు ముగిసినా బకాయిలు చెల్లించని క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. చెల్లింపు గడువును మరింత పొడిగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఖాతాదారులు భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన రుణ పునర్ వ్యవస్థీకరణ పథకం, లేదంటే బ్యాంకు ప్రకటించిన రీపేమెంట్ గడువును ఎంచుకోవచ్చని ఎస్బీఐ కార్డ్స్ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్ తివారీ తెలిపారు. ఈ రెండింటిలోనూ వడ్డీ రేటు ఆకర్షణీయంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇక్కడో కిటుకు ఉంది. ఎస్బీఐ రీపేమెంట్ పథకాన్ని ఎంచుకుంటే, మారటోరియం గడువు ముగిసి బకాయిలు చెల్లించని ఖాతాదారుల వివరాలు సిబిల్‌కు చేరవని తివారీ స్పష్టం చేశారు. అయితే, అంతమాత్రాన వారి పరపతి రేటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు.