మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు: రోజా
- టీడీపీ హయాంలో 40 ఆలయాలను కూల్చివేశారు
- గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది మృతి
- దుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఆలయ రథం దగ్ధం ఘటన ఏపీ రాజకీయాలను ఊపేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ సర్కారు ఇప్పటికే సీబీఐ విచారణకు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో మాట్లాడారు. విచారణలో నిజాలు నిగ్గుతేలతాయని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులా పిరికిపంద రాజకీయాలు సీఎం జగన్‌కు తెలియవని ఆమె చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ హయాంలో 40 ఆలయాలను కూల్చివేశారని చెప్పారు. అంతేగాక గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అప్పట్లో దుర్గగుడి, శ్రీకాళహస్తి ఆలయాల్లో క్షుద్రపూజలు జరిగాయని తెలిపారు. మరోవైపు తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చేశారని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్నడూ ఆయా ఘటనలపై సీబీఐ విచారణ కోరలేదని ఆమె చెప్పారు.