దేశంలో 54 లక్షల మార్క్ దాటిన కరోనా కేసుల సంఖ్య
- గత 24 గంటల్లో 92,605 కేసులు వెలుగులోకి
- ఇప్పటి వరకు 86,752 మంది బలి
- యాక్టివ్‌గా 10,10,824 కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఫలితంగా దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 54 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో 92,605 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 54,00,620కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది. మొత్తం కేసుల్లో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే, మొత్తంగా 43,03,044 మంది కోలుకున్నారు. 86,752 మంది కరోనా కాటుకు బలయ్యారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 3,01,273 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కర్ణాటకలో 1,01,148, ఆంధ్రప్రదేశ్‌లో 84,423, ఉత్తరప్రదేశ్‌లో 67,825, తమిళనాడులో 46,506 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. ఈ నెల 19 నాటికి మొత్తం 6,36,61,060 నమూనాలు పరీక్షించారు. వీటిలో 12,06,806 శాంపిళ్లను నిన్న ఒక్కరోజే పరీక్షించారు.