అమరావతిపై దాఖలైన 93 పిటిషన్ల విచారణను వాయిదా వేసిన హైకోర్టు

  • ఈ రోజు ఆన్ లైన్లో పిటిషన్లను విచారించిన హైకోర్టు
  • సాంకేతిక కారణాలతో విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • అక్టోబర్ 5 నుంచి రెగ్యులర్ గా విచారిస్తామన్న ధర్మాసనం
ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణను వచ్చే నెల 5వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు, హైపవర్ కమిటీకి చట్టబద్ధత వంటి అంశాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.

 అమరావతి రైతులు మొత్తం 93 పిటిషన్లను దాఖలు చేశారు. తమతో సీఆర్డీయే చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ తమ పిటిషన్లో రైతులు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను ఈరోజు ఆన్ లైన్ లో హైకోర్టు విచారించింది. సాంకేతిక కారణాలతో విచారణను వాయిదా వేస్తున్నామని చెప్పింది. అక్టోబర్ 5 నుంచి రెగ్యులర్ గా విచారణ జరుపుతామని తెలిపింది. పిటిషన్లలోని కొత్త అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


More Telugu News