ఏవండోయ్ నాని గారూ... అంటూ దివ్యవాణి వీడియో
- మంత్రి కొడాలి నానిపై విమర్శలు
- మీ గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి
- ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అంటూ వ్యాఖ్యలు
ఏపీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం ఆనవాయితీ. ఇటీవల కూడా తనదైన రీతిలో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఓ వీడియోతో బదులిచ్చారు. ఏవండోయ్ నాని గారూ... చంద్రబాబు ఓ శిఖరం... ఆయనను ఢీకొట్టడం సాధ్యమయ్యే పనికాదు అంటూ దివ్యవాణి స్పష్టం చేశారు.
"ఏంటండీ నాని గారూ... ఈ మధ్య పదేపదే పక్క రాష్ట్రం వదిలిపెట్టి వచ్చారు, పక్క రాష్ట్రం వదిలి పెట్టి వచ్చారు.. ఎవరెవరివో కాళ్లు పట్టుకున్నారు అంటున్నారు... మరి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? కానీ మీ సంగతికి సంబంధించి మా వద్ద మాత్రం ప్రూఫ్స్ ఉన్నాయి. మోదీ గారి కాళ్లపై ఎవరు పడ్డారు? కేసీఆర్ కాళ్లపై ఎవరు పడ్డారు? విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి కాళ్లపై పడిన అందరి గురించి ఆధారాలు ఉన్నాయి. ఏవండోయ్ నాని గారూ... మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తోందా? మీరేం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో పడిపోతున్నారా? ఓహో... త్వరలోనే మంత్రి వర్గ మార్పులు ఉంటాయని జగన్ చెప్పినందుకేనా!" అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శించారు.