మనకు ఇష్టమైన వ్యక్తుల ఫొటోపై ఉమ్మేస్తే ఊరుకుంటామా?: కొడాలి నానిపై మండిపడ్డ రఘురామకృష్ణరాజు
- విగ్రహాల ధ్వంసంపై నాని వ్యాఖ్యలు సరికావు
- ఇదే మాదిరి ఉంటే జనాలు తిరగబడతారు
- మోదీ, యోగి గురించి తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు
ఏపీలో హిందూ దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. మన ఇంట్లో పెట్టుకున్న ఇష్టమైన వ్యక్తులు, దేవుళ్ల ఫోటోలపై ఎవరైనా ఉమ్మేస్తే... ఫొటోయే కదా అని ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
దేవాలయాల్లో విగ్రహాలను పగలగొట్టి ఇంకొకటి పెడతామని, రథం దగ్ధమైతే కొత్తది తయారు చేయిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. ఇదే విధంగా ఉంటే జనాలు తిరగబడి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వారిద్దరూ ఏమిటో కూడా తెలుసుకోకుండా... నోటికొచ్చినట్టు మాట్లాడటం దారుణమని మండిపడ్డారు.