ఎస్పీ బాలుని కడసారి చూసి నివాళులర్పించిన ప్రముఖులు.. కాసేపట్లో అంత్యక్రియలు

  • తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు 
  • తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన ప్రముఖులు
ఎస్పీ బాలుని కడసారి చూసి నివాళులర్పించిన ప్రముఖులు.. కాసేపట్లో అంత్యక్రియలు
తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి.  చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన పలువురు ప్రముఖులు ఆయనను కడసారి చూసుకున్నారు.  సినీ ప్రముఖులు భారతీరాజాతో పాటు దేవి శ్రీ ప్రసాద్‌, శివబాలాజీ, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి.

కాగా, బాలును కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించేందుకు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బాలు పార్థివదేహాన్ని చూసేందుకు అనుమతిస్తున్నారు.



More Telugu News