అయ్యా సజ్జల రెడ్డి.. చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు: బుద్ధా వెంకన్న

  • వరద గురించి సజ్జల మాట్లాడటం హాస్యాస్పదం
  • అవినీతి కట్టలతో కోటలు నిర్మించే  జగన్ మోచేతి నీళ్లు తాగుతారు
  • జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పగలరా?
కృష్ణానదికి వరద వస్తోందని, ఇకనైనా చంద్రబాబు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న  కౌంటర్ ఇచ్చారు.  

'అవినీతి బురదలో ఉన్న సజ్జల.. వరద గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతి కట్టలతో కోటలు నిర్మించే వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగే సజ్జల గారు చంద్రబాబు గారి అద్దె ఇంటి కోసం ఆందోళన చెందటం వింతగా ఉంది' అని  బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

'అయ్యా సజ్జల రెడ్డి.. చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా? ముందు దొంగ సొమ్ముతో కట్టిన రాజ భవంతులు పేదలకు పంచి, ఆ తరువాత ఇతరులను విమర్శించండి' అని బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.


More Telugu News