భారత ఆర్మీకి రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు కొనేందుకు కేంద్రం ఓకే!
- సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు
- అధునాతన ఆయుధాలు కొనాలని నిర్ణయం
- యూఎస్ నుంచి రానున్న 72 వేల రైఫిల్స్
చైనాతో పాటు పాకిస్థాన్ సరిహద్దుల్లో రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పలికింది. మొత్తం రూ,. 2,290 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో భాగంగా యూఎస్ నుంచి 72 వేల సిగ్ సవూర్ అసాల్ట్ రైఫిల్స్, ఇతర పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఈ ప్రతిపాదనలను డీఏసీ (డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్) ఆమోదించగా, ఆ వెంటనే రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయాధికార కమిటీ,సైనికులకు మరిన్ని ఆయుధాలు అందించేందుకు అంగీకరించింది. ఈ నిధులతో రైఫిల్స్ తో పాటు వాయు, నౌకాదళాలకు స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ సిస్టమ్ లను కూడా కొనుగోలు చేయనున్నారు. వీటి ధర రూ. 970 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది.
కాగా, ఎటువంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో భారత సైన్యం భారీ ఎత్తున ఆయుధాలను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా లైట్ మెషీన్ గన్స్, బ్యాటిల్ కార్బైన్స్ తదితరాలను కొనుగోలు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక సైన్యం కలిగున్న టాప్-2 దేశంగా ఉన్న భారత సైన్యం.. తన అవసరాల నిమిత్తం 7 లక్షల రైఫిల్స్, 44 వేల లైట్ మెషీన్ గన్స్, 44,600 కార్బైన్స్ సమకూర్చుకునే పనిలో పడింది.