‘అవతార్ 2’ షూటింగ్ పూర్తైంది: జేమ్స్ కామెరున్
- కరోనా కారణంగా షూటింగ్ వాయిదా
- మళ్లీ ప్రారంభం
- ప్రస్తుతం అవతార్ 3 షూటింగ్ పనులు
- వచ్చే ఏడాది డిసెంబరులో అవతార్ 2 విడుదల
‘అవతార్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆ సినిమాలో వినియోగించిన గ్రాఫిక్స్ ప్రపంచ ప్రేక్షకులతో ఔరా అనిపించాయి. అంతకు మించిన అద్భుతాలను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు దర్శకుడు జేమ్స్ కామెరున్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ‘అవతార్ 2’, ‘అవతార్ 3’, ‘అవతార్ 4’, ‘అవతార్ 5’ సినిమాలు తీస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ‘అవతార్ 2’ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.
మళ్లీ ఈ సినిమా పనులను ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్ మాట్లాడుతూ... ‘అవతార్ 2’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. అంతేగాక, ‘అవతార్ 3’ షూటింగ్ కూడా ఇప్పటికే 95 శాతం పూర్తయిందని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరులో ‘అవతార్ 2’ విడుదలవుతుందని ఆయన తెలిపారు. ‘అవతార్ 2’లో అండర్‌వాటర్ సీన్లు అధికంగా ఉంటాయని వివరించారు. అందుకోసం తమ సినిమా బృందం బాగా కష్టపడ్డారని వెల్లడించారు. ఇక 'అవతార్ 3' చిత్రాన్ని 2024 డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.