ఇక నువ్వు ఐఏఎస్‌ అధికారివి అవుతావు!: సాయం కోరిన యువకుడికి సోనూసూద్ అభయం

  • సోనూ సూద్ సర్ ప్లీజ్‌.. ప్లీజ్‌ అంటూ యువకుడి అభ్యర్థన
  • తన చదువుకోసం అడుక్కుంటున్నానని ట్వీట్
  • ధన సాయం చేయాలని వినతి 
  • సాయం చేస్తానని భరోసా ఇచ్చిన సోను
కరోనా సంక్షోభం సమయంలో పేదలకు సాయం చేయడం ప్రారంభించిన సినీనటుడు సోనూసూద్ అనంతరం కూడా తన సాయాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. సాయం కోరిన వెంటనే 'నీకు నేనున్నాను మిత్రమా' అంటూ అభయమిస్తోన్న సోనూసూద్‌ తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

'సోనూ సూద్ సర్ ప్లీజ్‌.. ప్లీజ్‌ సర్. నేను నా చదువుకోసం అడుక్కుంటున్నాను. మా క్లాసులో నేను టాపర్. కానీ, నా వద్ద డబ్బు లేదు. దయచేసి ఈ కింది లెటర్ చదవండి.. నా చదువుకోసం సాయం చేయండి. నేను ఐఏఎస్‌ అధికారిని కావాలనుకుంటున్నాను' అని కరీముల్లా అనే యువకుడు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సోనూసూద్ 'నీవు ఐఏఎస్ అధికారివి అవుతావు. సాయం చేస్తాను' అని ట్విట్టర్‌లో ప్రకటించారు.  



More Telugu News