మహీంద్రా సెకండ్ జనరేషన్ ఎస్ యూవీ 'థార్' ఇదిగో!
- మహీంద్రా నుంచి బీఎస్-6 ప్రమాణాలతో థార్
- ప్రారంభ ధర రూ.9.8 లక్షలు
- గరిష్ఠంగా రూ.13.75 లక్షల ఎక్స్ షోరూం ధర
ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా గత కొంతకాలంగా కార్లు, బైకులపైనా శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో తన సెకండ్ జనరేషన్ ఎస్ యూవీ థార్ ను ఇవాళ భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన థార్ ఏఎక్స్, ఎల్ఎక్స్ మోడళ్లలో వస్తోంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వస్తున్న ఈ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ప్రారంభ ధర రూ.9.8 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.13.75 లక్షల వరకు ధర నిర్ణయించారు. ఇవి ఎక్స్ షోరూం ధరలు.
ఇందులో క్రూయిజ్ కంట్రోల్, అడ్వెంచర్ స్టాటిస్టిక్స్ డిస్ ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనంలో ఫోర్ వీల్ డ్రైవ్ వ్యవస్థ పొందుపరిచారు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మోడళ్లకు ధరల్లో వ్యత్యాసం ఉంది. స్టాండర్డ్ మోడల్ లో ఫిక్స్ డ్ సాఫ్ట్ టాప్, డ్యూయల్ ఎయిర్ బాగ్స్, ఏబీఎస్ బ్రేకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి అదనంగా మరింత మెరుగైన భద్రతకోసం ఇంటిగ్రేటెడ్ రోల్ కేజ్ వ్యవస్థ కూడా పొందుపరిచారు.