గూగుల్ కు సవాల్ విసిరిన పేటీఎం... సొంత మినీ యాప్ స్టోర్ ప్రారంభం!
- ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ సేవలు
- డౌన్ లోడ్ చేసుకోకుండానే వాడుకునే సదుపాయం
- ఇప్పటికే పలు ప్రముఖ యాప్ సేవలు మొదలు
- క్రమంగా పెరుగుతున్న యూజర్ల సంఖ్య
చెల్లింపు మాధ్యమ సేవల సంస్థ పేటీఎం, ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ ను ప్రారంభించడం ద్వారా గూగుల్ కు సవాల్ విసిరింది. ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించిన ఉదంతం నేపథ్యంలో, పేటీఎం సొంతంగా యాప్ స్టోర్ ను ప్రారంభించడం గమనార్హం. యాప్ డెవలపర్లు తమ ప్రొడక్టులను స్మార్ట్ ఫోన్ యూజర్ల దరికి చేర్చడంలో తమవంతు పాత్రను పోషిస్తామని ఈ సందర్భంగా పేటీఎం వ్యాఖ్యానించింది. యాప్స్ విషయంలో ఇప్పటివరకూ గూగుల్ ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగగా, ఇప్పుడు పేటీఎం నుంచి పోటీ ప్రారంభమైంది.
తన మినీ యాప్ స్టోర్ లో భాగంగా, యాప్స్ లిస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ సేవలను ఏ విధమైన చార్జీలు లేకుండా పేటీఎం అందించనుంది. డెవలపర్లు తమకు ఇష్టమైతే పేటీఎం వాలెట్, పేమెంట్స్ బ్యాంక్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ చెల్లింపు సేవలను తమ యాప్ ద్వారా ప్రమోట్ చేయవచ్చని కూడా పేటీఎం వెల్లడించింది. ఇక ఈ యాప్ స్టోర్ లోని అప్లికేషన్స్ ను డౌన్ లోడ్ చేసుకోకుండానే వాడుకోవచ్చు. ఈ కారణంగా కోట్లాది మంది యూజర్లు, తమ డేటా, మెమొరీని నష్టపోకుండా సేవలందుకునే వీలుంటుందని సంస్థ వ్యాఖ్యానించింది.
కాగా, గాంబ్లింగ్ పాలసీలకు విరుద్ధంగా పేటీఎం పనిచేస్తున్నదని ఆరోపిస్తూ, గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తాత్కాలికంగా తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ తదితరాలు, తమ స్పోర్ట్స్ ఆధారిత క్యాష్ బ్యాక్ గేమ్స్ ను నిలిపివేశాయి. క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ గేమ్స్ ఆడించడం గేమింగ్ పాలసీకి విరుద్ధమంటూ, పలు కంపెనీలకు గూగుల్ నోటీసులు కూడా పంపించింది.
ఈ నేపథ్యంలో పేటీఎం, తానే స్వయంగా డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. చిన్న డెవలపర్లు, చిన్న చిన్న వ్యాపారులకు సహాయంగా ఉంటూ, తక్కువ ఖర్చుతో హెచ్టీఎంఎల్, జావా స్ట్రిప్ట్ లను వినియోగించుకుని, మినీ యాప్స్ ను అభివృద్ధి చేసుకునేందుకు కూడా సహకారం అందించాలని నిర్ణయించింది. ఈ మినీ యాప్ స్టోర్ లో ఇప్పటికే 300కు పైగా యాప్ ఆధారిత సేవలు అందుతున్నాయి. వాటిల్లో డెకాథ్లాన్, ఓలా, రాపిడో, నెట్ మెడ్స్, 1 ఎంజీ, డొమినోస్ పిజ్జా వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ యాప్ నూ డౌన్ లోడ్ చేసుకోకుండానే వాడుకునే వీలుండటంతో, క్రమంగా యూజర్ల సంఖ్య కూడా పెరుగుతోంది.