కేరళలో ఓనమ్ సందర్భంగా ఒక్కసారిగా కేసులు పెరిగాయి... పండుగ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి: ఈటల

  • త్వరలో బతుకమ్మ, దసరా సీజన్
  • ప్రజలు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచన
  • ప్రభుత్వ నియమావళి పాటించాలని హితవు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని, ఇదేవిధంగా కట్టడి చేస్తే రాష్ట్రం నుంచి వైరస్ ను పారదోలవచ్చని అన్నారు. అయితే, రానున్నది పండుగ సీజన్ కావడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకే పరిమితమై వేడుకలు జరుపుకోవాలని, పండుగ సమయాల్లో ఎక్కువ మంది కలిస్తే కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

కేరళలో ఓనమ్ పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారని, దాంతో అక్కడ ఒక్కసారిగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించిందని ఈటల వెల్లడించారు. అందుకే, బతుకమ్మ, దసరా సమయాల్లో ప్రభుత్వ నియమావళి మేరకు నడచుకోవాలని, ప్రభుత్వ సూచనలు పెడచెవినపెడితే కేరళ తరహా సమస్యలు తప్పవని హెచ్చరించారు.


More Telugu News