రంపచోడవరంలో కోతుల గ్యాంగ్ వార్... వీడియో ఇదిగో!

  • రెండు గ్రూపులుగా విడిపోయిన కోతులు
  • వీధుల్లో కొట్లాడిన వైనం
  • ఆసక్తిగా తిలకించిన స్థానికులు
గ్యాంగ్ వార్ అంటే మనుషులకు మాత్రమే పరిమితం అనుకోవద్దు! కోతులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగింది. సాధారణంగా కోతులు ఎప్పుడూ ఓ సమూహంగా తిరుగుతుంటాయి.

మరి, ఇక్కడ ఏమయ్యిందో కానీ రంపచోడవరంలో దాదాపు వందకు పైగా కోతులు రెండు వర్గాలుగా విడిపోయాయి. రండి.. చూసుకుందాం అంటూ ఎంతో ఆవేశంతో వైరి పక్షంపై కలబడ్డాయి. ఈ ఘటన స్థానికులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఇళ్లపై దాడి చేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేసే కోతులు తమలో తామే కలహించుకోవడంతో జనాలు ఆసక్తిగా తిలకించారు.


More Telugu News