బాలుగారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాను: చంద్రబాబు
- తెలుగువారందరికీ గర్వకారణమైన కళాకారుడు బాలుగారు
- స్వర్గస్తులై అప్పుడే పదకొండు రోజులు గడిచాయి
- ఆ మధురమైన స్వరం నిత్యం చెవుల్లో మారుమోగుతూ ఉంది
- ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారనిపిస్తోంది
గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. వేలాది పాటలు పాడి దేశ, విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. బాలుగారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పేర్కొన్నారు.
'తెలుగువారందరికీ గర్వకారణమైన కళాకారుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్తులై అప్పుడే పదకొండు రోజులు గడిచాయి. ఆ మధురమైన స్వరం నిత్యం చెవుల్లో మారుమోగుతూ ఉంటే ఆయన ఇంకా మన మధ్యే ఉన్నారనిపిస్తోంది. ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ, బాలుగారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాను' అంటూ చంద్రబాబు ఓ వీడియో పోస్ట్ చేశారు. బాలు ఫొటో వద్ద పూలు వుంచి చంద్రబాబు నివాళులు అర్పించారు.