కీలక పదవి కోసం పోటీ పడుతున్న అరుణ్ జైట్లీ కుమారుడు

  • డీడీసీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రోహన్ జైట్లీ
  • సంపూర్ణ మద్దతు ప్రకటించిన డీడీసీఏ సభ్యులు 
  • అప్పుడే వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులను అలంకరించిన దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ కీలక పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇండియన్ క్రికెట్లో అత్యంత కీలకమైన వాటిలో ఒకటైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

మరోవైపు, రోహన్ గెలుపు నల్లేరుపై నడకే కాబోతోంది. డీడీసీఏలోని సభ్యులు ఆయనకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయనకు అప్పుడే శుభాభినందనలు ప్రారంభమయ్యాయి. డీడీసీఏ అధ్యక్షుడిగా 1999 నుంచి 2003 వరకు అరుణ్ జైట్లీ సేవలందించారు. ఆ కారణం వల్లే ఆయన చనిపోయిన తర్వాత ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్ కు అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


More Telugu News