ఎస్బీఐ యోనో యాప్ సేవలకు రేపు అంతరాయం!

  • రేపు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో నిలిచిపోనున్న యాప్
  • అసౌకర్యానికి చింతిస్తున్నామన్న ఎస్బీఐ
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా సేవలను పొందవచ్చని సూచన
తన వినియోగదారులకు అవసరమైన అన్ని సేవలను యోనో యాప్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. రేపు ఈ యాప్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ ప్రకటించింది. యాప్ నిర్వహణలో భాగంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో యాప్ పని చేయదని వెల్లడించింది. అసౌకర్యానికి  చింతిస్తున్నామని తెలిపింది.

నిన్న కూడా ఈ సేవలను ఎస్బీఐ ఆపేసింది. యాప్ ఆగిపోయే సమయంలో తమ కార్యకలాపాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఎస్బీఐ కోరింది. యోనో యాప్ వాడేవారు ప్రత్యామ్నాయంగా ఎస్బీఐ నెట్ ద్వారా సేవలు పొందవచ్చని తెలిపింది. యోనో యాప్ లోకి ఇటీవలే ఎస్బీఐ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ వినియోగించే వారు యాప్ లోకి లాగిన్ కాకుండానే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి సేవలను పొందొచ్చు.


More Telugu News