జడ్జీలపై ఫిర్యాదు సలహాదారులే చేశారని ఢిల్లీ వాళ్లకు ఫోన్లు చేసి చెబుతున్నారట: బుద్ధా వెంకన్న

  • జగన్ జడ్జీలపై ఫిర్యాదు చేశారు
  • తనకేం సంబంధం లేదని విజయసాయిరెడ్డి అంటున్నారట
  • ఇప్పుడు మనం సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేమని బాధా?
  • ప్రమాదాల నుంచి కాపాడుకొనే మార్గం వెతుక్కొనే పనిలో పడినట్లున్నారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్‌వీ రమణ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల లేఖ రాశారు. దీనిపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘వైఎస్ జగన్ జడ్జీలపై రాసిన కంప్లయింట్ తో నాకేం సంబంధం లేదు... అంతా సలహాదారులే చేశారని ఢిల్లీ వాళ్లకు ఫోన్లు చేసి చెబుతున్నారట విజయ సాయిరెడ్డి.. ఇప్పుడు మనం సలహాలు ఇచ్చే పరిస్థితిలో లేమని బాధా? లేక ఇస్తున్న వారిపై మంటా? మొత్తానికి రాబోయే ప్రమాదాల నుంచి కాపాడుకొనే మార్గం వెతుక్కొనే పనిలో పడినట్లున్నారు’ అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.


More Telugu News