బ్యాట్ ఝుళిపించిన కెప్టెన్ స్మిత్, ఊతప్ప... రాజస్థాన్ 177/6
- ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ బెంగళూరు
- మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
- అర్ధసెంచరీ సాధించిన స్మిత్
- శుభారంభం అందించిన ఊతప్ప
- క్రిస్ మోరిస్ కు 4 వికెట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అర్ధసెంచరీతో రాణించాడు. స్మిత్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 57 పరుగులు నమోదు చేశాడు. అంతకుముందు ఓపెనర్ రాబిన్ ఊతప్ప ఆరంభంలో విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 41 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించాడు.
కాగా, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. టోర్నీ తొలిదశలో అదిరిపోయేలా ఆడిన సంజూ శాంసన్ (9) మరోసారి పేలవ ఆటతీరు కనబర్చాడు. జోస్ బట్లర్ (24), రాహుల్ తెవాటియా (19 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్ కు 4 వికెట్లు దక్కాయి. అదే పనిగా నోబాల్స్ వేసినా... యజువేంద్ర చహల్ 2 వికెట్లు పడగొట్టాడు.