బాలీవుడ్ లో మరో కుదుపు.. మిథున్ చక్రవర్తి కుమారుడిపై రేప్ కేసు నమోదు
- మహాక్షయ్ అత్యాచారం చేశాడని 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు
- పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపణ
- అతడి తల్లిపై కూడా కేసు నమోదు
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై రేప్ కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేసి ఆ తర్వాత మోసం చేసినట్టు 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో ముంబైలోని ఓషివారా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 2015 నుంచి 2018 వరకు తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని తెలిపింది.
2015లో వెస్ట్ అంధేరీలో మహాక్షయ్ ఫ్లాట్ కొన్నాడని, దాన్ని చూసేందుకు వెళ్లిన తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడని చెప్పింది. అతని వల్ల గర్భవతినయ్యానని, పెళ్లి చేసుకోవాలని అడిగితే గర్భస్రావం కావడానికి పిల్స్ ఇచ్చాడని తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెపుతూ మూడేళ్లు మోసగించాడని... 2018 జనవరిలో వివాహం గురించి తాను అడిగితే పెద్ద గొడవ అయిందని చెప్పింది. మహాక్షయ్ కు అతడి తల్లి యోగితా బాలి కూడా సహకరించిందని, తనను బెదిరించిందని పిటిషన్ లో పేర్కొంది.
ఈ ఏడాది జూలైలో ఓషివారా పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు మహాక్షయ్ పై అత్యాచారం (ఐపీసీ 376), పలుమార్లు అత్యాచారం (ఐపీసీ 376 (2) ఎన్), మోసం చేయడం (ఐపీసీ 417), క్రిమినల్ బెదిరింపులు (ఐపీసీ 506) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడి తల్లి యోగితపై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు మహాక్షయ్ 'హాంటెడ్ 3డీ', 'లూట్' వంటి చిత్రాల్లో నటించాడు.