నెటిజన్ వేసిన ప్రశ్నకు జవాబుగా బీజేపీపై కేటీఆర్ సెటైర్!
- మీరు ఎంతగా ప్రజల్లో తిరిగినా వైరస్ సోకడం లేదు
- కోవాక్సిన్ తీసుకున్నారా? అని ప్రశ్నించిన నెటిజన్
- దాన్ని బీహార్ ప్రజలకు రిజర్వ్ చేశారన్న కేటీఆర్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్ లో, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేస్తూ, రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నెట్టింట తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్, బీజేపీపై సెటైర్లు వేశారు.
"కేటీఆర్ సర్. మీరు ఇటీవల భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఆ సమయంలో కరోనా టీకాను తీసుకున్నారా? ఈ ప్రశ్నను నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, మీరు ప్రజల్లో ఎంతగా తిరుగుతూ ఉన్నా, మీకు ఏమీ కాలేదు. దీనికి కారణం మరేమైనా ఉందా?" అని ఓ ప్రశ్న ఎదురైంది.
దీనికి సమాధానం ఇచ్చిన కేటీఆర్, "అటువంటిది ఏమీ లేదు. నేనేమీ కరోనా వ్యాక్సిన్ ను తీసుకోలేదు. వ్యాక్సిన్ ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారట" అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.