నవంబర్ 9న జైలు నుంచి లాలూ వస్తారు.. మర్నాడే నితీశ్ కు వీడ్కోలు: తేజశ్వి యాదవ్
- ఎన్నికల ప్రచారంలో తేజశ్వి సంచలన వ్యాఖ్యలు
- తమదే గెలుపని భరోసా వ్యక్తం చేసిన తేజశ్వి
- ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
వచ్చే నెల 9న ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూప్రసాద్ యాదవ్ జైలు నుంచి బయటకు వస్తారని, ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నేత తేజశ్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందనే భరోసాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ లోని హిసువాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజశ్వి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
అవినీతి కేసులో లాలూ ఝార్ఖండ్ లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా ఆయన బయటకు రాలేకపోయారు. మరో కేసులో బెయిల్ రావాల్సి ఉండటం వల్ల ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు, ఇదే సమయంలో ప్రధాని మోదీపై తేజశ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బీహార్ కు మోదీ వస్తున్నారని... రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎప్పుడిస్తారో ఆయన చెపితే వినాలనుకుంటున్నానని అన్నారు.