ధరణి పోర్టల్ ను ప్రారంభించిన సీఎం.. ఇకపై అన్నీ ఈ పోర్టల్ నుంచే!

  • మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పోర్టల్ ప్రారంభం
  • ఇకపై అన్ని వివరాలు ఆన్ లైన్లోనే
  • రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అన్నీ పోర్టల్ లోనే
తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ ను వేదమంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రి ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభంతో, ఇప్పటి వరకు పుస్తకాలకే పరిమితమైన భూముల వివరాలు ఇకపై ఆన్ లైన్ కాబోతున్నాయి.

ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర రికార్డులన్నీ ధరణి  పోర్టల్ లో ఉండబోతున్నాయి. ప్లాట్ బుకింగ్ నుంచి పాస్ పుస్తకాల వరకు అన్నీ పోర్టల్ లోనే ఉంటాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ పోర్టల్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది.


More Telugu News