గొప్పలు చెప్పుకుంటూ రిటైర్ మెంట్ రోజులు గడుపుతున్న చంద్రబాబు: విజయసాయి రెడ్డి
- తన హయాంలో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందన్న చంద్రబాబు
- అదే జరిగితే నిరుద్యోగులే ఉండేవారు కారన్న విజయసాయి
- నిరుద్యోగ భృతి ఇచ్చే అవసరం ఎందుకు తెచ్చారని ప్రశ్న
తన పాలనలో రాష్ట్రానికి రూ. 15 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "బాబు చెప్పినట్టు తన ‘చిట్ట చివరి’ ఐదేళ్ల పాలనలో 15 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి ఉంటే రాష్ట్రంలోని యువతీ, యువకులెవ్వరూ నిరుద్యోగులుగా మిగలకూడదు. నిరుద్యోగ భృతి ఇచ్చే అవసరం కూడా అయనకు వచ్చి ఉండకూడదు. పాపం. ఇలా గొప్పలు చెప్పుకుంటూ రిటైర్మెంట్ రోజుల్ని వెళ్లదీస్తున్నాడు" అని అన్నారు.