ప్రారంభమైన 17వ ఆసియాన్ ద్వైవార్షిక సదస్సు.. వర్చువల్‌గా ప్రసంగించిన మోదీ
- కొవిడ్-19 ఆసియాన్ ప్రతిస్పందన నిధికి 10 లక్షల డాలర్ల విరాళం
- ఆసియాన్ దేశాలతో అనుసంధానానికి భారత్ అమిత ప్రాధాన్యం
- ఆసియాన్ దృక్పథం, భారత్ ఆలోచనలు రెండూ ఒకేలా ఉన్నాయన్న ప్రధాని
వియత్నాం ఆధ్వర్యంలో నిన్న 17వ ఆసియాన్ ద్వైవార్షిక సదస్సు ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొని కీలక విషయాలపై ప్రసంగించారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని సురక్షిత సముద్రయాన ప్రాంతంగా మార్చాలన్న గత సదస్సు ప్రతిపాదనను గుర్తు చేశారు. సముద్రయానం విషయంలో అనుసంధానానికి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఆసియాన్ దేశాలకు తాము ఇస్తామని చెప్పిన 100 కోట్ల డాలర్లను వినియోగించుకోవాలని కోరారు.
అలాగే, కొవిడ్-19 ఆసియాన్ ప్రతిస్పందన నిధికి భారత్ తరపున మోదీ 10 లక్షల డాలర్లను విరాళంగా ప్రకటించారు. ఆసియాన్ దేశాలతో అనుసంధానాన్ని మరింత పెంచుకునేందుకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధిని మెరుగుపరిచేందుకు ఆసియాన్ బృందం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం విషయంలో భారత్ ఆలోచనలు, ఆసియాన్ దృక్పథం రెండూ ఒకేలా ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.