మహారాష్ట్రలోని లోనార్ సరస్సుకు 'రాంసార్ సైట్' గుర్తింపు
- యునెస్కో గుర్తింపు పొందిన భారత చిత్తడినేలలు
- ఉల్కాపాతంతో ఏర్పడిన లోనార్ సరస్సు
- అనేక జీవజాతులకు ఆవాసంగా సరస్సు
ప్రపంచ ప్రాముఖ్యత ఉన్న చిత్తడి నేలలకు 'రాంసార్' (ఇరాన్ నగరం) ఒప్పందం కింద యునెస్కో ప్రత్యేక గుర్తింపునిస్తుంది. ఎంతో విశిష్టత ఉన్న ప్రదేశాలకు ఈ గుర్తింపునిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని లోనార్ సరస్సుకు 'రాంసార్ సైట్' గుర్తింపునిచ్చారు. ప్రశస్తమైన చిత్తడినేలలు ఈ ప్రాంతంలో ఉన్నాయని యునెస్కో భావిస్తోంది. భారత్ లో 'రాంసార్ సైట్' గుర్తింపు పొందిన ప్రదేశాల జాబితాలో లోనార్ సరస్సు 41వది.
మహారాష్ట్రలోని లోనార్ సరస్సు ఉల్కాపాతం వల్ల ఏర్పడినట్టు భావిస్తారు. ఈ సరస్సు, పరిసర అటవీప్రాంతం ఆవాసంగా 160కి పైగా జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. వీటిలో ఏషియన్ వూలీనెక్, కామన్ పోచర్డ్ పక్షులు కూడా ఉన్నాయి. 46 రకాల సరీసృపాలు, 12 జాతుల క్షీరదాలు లోనార్ సరస్సు వద్ద కనిపిస్తుంటాయి. అంతేకాదు, ఎంతో విశిష్టత ఉన్న గ్రే ఉల్ఫ్ కు కూడా ఈ సరస్సే ఆవాసం.