ఒక ప్రచార సభను నిర్వహించనున్న కేసీఆర్

  • డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్
  • రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కేటీఆర్
  • ఎల్బీ స్టేడియంలో ప్రచార సభను నిర్వహించనున్న కేసీఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో, అన్ని పార్టీలు తమ కీలక నేతలందరినీ బరిలోకి దింపి, ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో ఉన్నాయి.

టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. 21న లేదా 22న కేటీఆర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి రోడ్ షోలను ప్రారంభించనున్నారు. ఈ రోడ్ షోల ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు డివిజన్లకు సంబంధించి ఒకే చోట రోడ్ షో సభ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక సభలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో, 28న లేదా 29న ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ ఉంటుందని చెపుతున్నారు.


More Telugu News