ట్రంప్ ఎలా ఆలోచిస్తాడన్న విషయాన్ని చెప్పడం కష్టం: జో బైడెన్‌

  • ఎవరూ ఊహించని రీతిలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు
  • ప్రజాస్వామ్యం గురించి ఇతర ప్రాంతాలకు ప్రతికూల సందేశం
  • అమెరికా చరిత్రలోనే అత్యంత బాధ్యతా రహితమైన అధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, అధికార మార్పిడికి ట్రంప్ ఒప్పుకోకుండా చూపుతున్న తీరుపై అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ విమర్శలు గుప్పించారు. ఆయన ఎవరూ ఊహించని రీతిలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారని బైడెన్‌ అన్నారు.

ట్రంప్ తీరు వల్ల ప్రజాస్వామ్యం గురించి ఇతర ప్రాంతాలకు ప్రతికూల సందేశం వెళుతుందని ఆయన చెప్పారు.  ట్రంప్‌ ప్రదర్శిస్తోన్న ప్రతి చర్యను వారు గుర్తుంచుకునేలా చేస్తుందని అన్నారు.  తమ దేశ చరిత్రలోనే అత్యంత బాధ్యతా రహితమైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారని ఆయన చెప్పారు.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను జో బైడెన్‌ ఖండిస్తూ... ఈ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోలేకే రిపబ్లికన్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ట్రంప్ ఎలా ఆలోచిస్తాడన్న విషయాన్ని చెప్పడం కష్టమని బైడెన్ చెప్పుకొచ్చారు. తాను వచ్చే ఏడాది  20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పారు. ట్రంప్ వల్ల అధికార మార్పిడిలో జాప్యం జరుగుతుండడంతో కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం కష్టతరంగా మారుతుందని తెలిపారు.


More Telugu News