ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పర్వం

  • గత మూడ్రోజులుగా నామినేషన్ల స్వీకరణ
  • నేడు ఆఖరు రోజు
  • ఎల్లుండి ఉపసంహరణకు అవకాశం
గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించగా, ఇవాళ చివరిరోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తారు. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన జరిపి, ఎల్లుండి ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే తమ తుది జాబితాలు ప్రకటించగా, కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బల్దియా ఎన్నికలను అధికార టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు, ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్న విషయం దుబ్బాక విజయంతో నిరూపితమైందని భావిస్తున్న బీజేపీ అదే ఊపును గ్రేటర్ లోనూ చూపించాలని తహతహలాడుతోంది. తాజాగా జనసేన మద్దతు కూడా లభించడంతో ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది.


More Telugu News