ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు: రోహిత్ శర్మ
- ఐపీఎల్ లో గాయపడ్డ రోహిత్ శర్మ
- ఆసీర్ టూర్ పెట్టుకుని మళ్లీ బరిలోకి దిగిన వైనం
- దేశం కంటే ఐపీఎల్ ఎక్కువా? అని విమర్శలు
టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన రోహిత్ ప్లేఆఫ్ దశకు ముందు కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే వెంటనే మళ్లీ మ్యాచ్ లకు అందుబాటులోకి వచ్చాడు. అత్యంత కీలకమైన ఆస్ట్రేలియా టూర్ కు ముందు ఇది జరగడంతో... రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. రోహిత్ కు దేశం కంటే ఐపీఎల్ ఎక్కువయిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై రోహిత్ శర్మ స్పందించాడు.
అసలు ఏం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని రోహిత్ అన్నాడు. జనాలు దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదని చెప్పాడు. తాను క్రమం తప్పకుండా బీసీసీఐ, ముంబై ఇండియన్స్ తో సంప్రదిస్తూనే ఉన్నానని తెలిపాడు. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ కాబట్టి తాను ఆడగలనని ముంబై ఇండియన్స్ కు చెప్పానని అన్నాడు.
తనకు అయిన గాయం చాలా చిన్నదని రోహిత్ చెప్పాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నానని తెలిపాడు. పెద్ద ఫార్మాట్ లో క్రికెట్ ఆడేముందు తాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ ఒక్క విమర్శ కూడా ఎదురు కాకుండా చూసుకోవాలని చెప్పాడు. పూర్తి ఫిట్ నెస్ ను సాధించడంతో పాటు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాల్సి ఉందని అన్నాడు.