యూఎస్ లో 10న కీలక సమావేశం, 11న అందుబాటులోకి వ్యాక్సిన్!
- సమావేశం కానున్న యూఎస్ ఎఫ్డీయే
- అత్యవసర వినియోగానికి అనుమతి లభించే అవకాశం
- ఆపై 24 గంటల్లోనే అన్ని రాష్ట్రాలకూ టీకా
అమెరికన్ ప్రజలకు డిసెంబర్ 11 లేదా 12వ తేదీల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని టీకా తయారీని పర్యవేక్షిస్తున్న ఆపరేషన్స్ వార్ఫ్ స్పీడ్ అధిపతి డాక్టర్ మోన్సెఫ్ స్లోయి వెల్లడించారు. ఇప్పటికే ఫైజర్ - బయో ఎన్ టెక్ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇవ్వాలంటూ యూఎస్ ఎఫ్డీయే (ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్)కు దరఖాస్తు పెట్టుకున్నాయని గుర్తు చేసిన ఆయన, డిసెంబర్ 10న ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్ అడ్వయిజరీ కీలక సమావేశం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభిస్తే, ఆపై 24 గంటల వ్యవధిలోనే అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్ ను పంపిస్తామని మోన్సెఫ్ వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ప్రజల్లో 70 శాతం వైరస్ నిరోధకత వచ్చినా, హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, తమ వ్యాక్సిన్ 95 శాతం వరకూ సత్ఫలితాలను చూపుతోందని ఫైజర్ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.