జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
- అందులో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
- దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుపై చర్చ
- నివర్ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వ్యాప్తి వల్ల రెండు రోజులకే కుదించి
ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.
దిశ చట్టం సవరణ ముసాయిదా బిల్లుతో పాటు పలు బిల్లులను అసెంబ్లీ అజెండాలో చేర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, నివర్ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంపై చర్చించే అవకాశం ఉంది.
పెండింగ్‌లో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ కార్యాచరణను కేబినెట్‌లో ఖరారు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలను కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.