25 కేంద్రాల్లో 26 వేల మందికి టీకా ఇచ్చామన్న భారత్ బయోటెక్!

  • అతిపెద్ద కొవిడ్ టీకా ట్రయల్ జరుగుతోంది
  • మోదీ భారత్ బయోటెక్ కు రావడంపై హర్షం
  • ప్రధాని పర్యటనతో స్ఫూర్తి కలిగిందన్న సంస్థ
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతిపెద్ద కొవిడ్ టీకా ట్రయల్ ఇండియాలో జరుగుతోందని భారత్ బయోటెక్ వ్యాఖ్యానించింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్లాంటును సందర్శించడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఓ ప్రకటన విడుదల చేసిన సంస్థ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చి పరిశీలిస్తున్నామని వెల్లడించింది.

బీఎస్ఎల్-3 స్థాయి కేంద్రంలో వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించింది. ఇక ప్రధాని పర్యటనతో టీకా తయారీలో శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులకు ఎంతో స్ఫూర్తి కలిగిందని భారత్ బయోటెక్ పేర్కొంది. ఆరోగ్య సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధత కూడా మరింతగా పెరిగిందని వెల్లడించింది.


More Telugu News