కోవాగ్జిన్ ట్రయల్స్ .. వలంటీర్‌గా పశ్చిమ బెంగాల్ మంత్రి
- కోల్‌కతాలోని ఎన్‌ఐసీఈడీలో మూడో దశ పరీక్షలు
- ట్రయల్స్‌లో పాల్గొంటానంటూ మంత్రి దరఖాస్తు
- ఆరోగ్య పరీక్షల్లో ఫిట్
ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ రేపటి నుంచి కోల్‌కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజ్ (ఎన్ఐసీఈడీ)లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌లో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఫిర్హాద్ హకీం (62) స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇక ఆయనతోపాటు దరఖాస్తు చేసుకున్న అందరినీ బుధవారం ట్రయల్స్‌కు రావాలంటూ అధికారులు పిలిచారు. వైద్య పరీక్షల్లో హకీం ఫిట్‌గా ఉండడంతో ఆయనపైనా టీకా ప్రయోగాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. కాగా, మూడోదశ ట్రయల్స్‌లో కనీసం వెయ్యి మంది వలంటీర్లకు కోవాగ్జిన్ టీకా ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.