ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి కన్నుమూత

  • బెన్ స్టోక్స్ కు పితృవియోగం
  • స్టోక్స్ తండ్రి జెడ్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్ తో మృతి
  • ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న బెన్ స్టోక్స్
  • తండ్రి మరణవార్తతో విషాదానికి గురైన వైనం
  • పర్యటన నుంచి తప్పుకుని న్యూజిలాండ్ వెళ్లే అవకాశం!
ఇంగ్లాండ్ వరల్డ్ కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు పితృవియోగం కలిగింది. బెన్ స్టోక్స్ తండ్రి జెడ్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్ తో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. జెడ్ స్టోక్స్ గత ఏడాది కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో ఇవాళ తుదిశ్వాస విడిచారు. జెడ్ స్టోక్స్ అంతర్జాతీయ రగ్బీ ఆటగాడిగా, కోచ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా, బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. తండ్రి మరణవార్తతో బెన్ స్టోక్స్ తీవ్ర విషాదానికి లోనయ్యాడు. స్టోక్స్ పర్యటన నుంచి తప్పుకుని న్యూజిలాండ్ వెళ్లే అవకాశాలున్నాయి. జన్మతః న్యూజిలాండ్ కు చెందిన బెన్ స్టోక్స్ క్రికెట్ కోసం ఇంగ్లాండ్ వెళ్లి అక్కడి జాతీయ జట్టుకు ఎంపికై కొద్దికాలంలో తిరుగులేని ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ఐపీఎల్ లోనూ కొన్ని మ్యాచ్ లు ఆడలేదు.


More Telugu News