వ్యాక్సిన్ కోసం ధనిక దేశాలు భారీ స్థాయిలో అడ్వాన్సు ఆర్డర్లు... మిగతా దేశాలు అంతంతమాత్రమే!
- వ్యాక్సిన్ విషయంలో వెనుకబడ్డ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు
- ఇండియాలో 59 శాతం ప్రజలకే వ్యాక్సిన్ ఆర్డర్
- డ్యూక్ యూనివర్శిటీ అధ్యయనం
ప్రపంచంలోని ధనిక దేశాలు ముందస్తు ఆర్డర్లతో వ్యాక్సిన్ స్టాక్స్ ను భారీగా పెంచుకుంటున్నాయని, తమ దేశంలోని అందరికీ సరిపడేలా టీకాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయని, ఇదే సమయంలో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు మాత్రం వెనుకబడ్డాయని యూఎస్ చెందిన డ్యూక్ యూనివర్శిటీ తన అధ్యయనంలో పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ధనిక దేశాల మధ్య ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, పేద దేశాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని తెలిపింది.
కాగా, ఇండియా 160 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను ముందస్తుగానే కొనుగోలు చేసింది. వ్యాక్సిన్లను భారత నియంత్రణా సంస్థలు అనుమతించగానే ఇవి అందుబాటులోకి వస్తాయి. అయితే, ఈ వ్యాక్సిన్లు ఇండియాలోని 59 శాతం ప్రజలకు మాత్రమే సరిపోతాయి. ఇక అధిక ఆదాయ దేశాలు వారి దేశాల్లోని ప్రజలందరికీ పలు దఫాలుగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమై, అందుకు తగ్గ స్టాక్స్ ను పెంచుకోవాలని నిర్ణయించాయి.
ఇక మధ్యాదాయ దేశాలు, దిగువ ఆదాయ దేశాలు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రస్తుతానికి లేవని డ్యూక్ యూనివర్శిటీ పేర్కొంది. అల్పాదాయ దేశాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కోవాక్స్ వంటి వ్యాక్సిన్లతో ఈ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా, అవి ప్రజలందరి అవసరాలు తీర్చేందుకు ఏ మాత్రం సరిపడవని వర్శిటీ అధ్యయనకారులు వెల్లడించారు.
ఇక టీకా డోస్ ల ఆర్డర్లను పరిశీలిస్తే, ఇండియా 160 కోట్ల డోస్ లతో తొలి స్థానంలో ఉండగా, ఆపై 136 కోట్ల డోస్ లతో యూరోపియన్ యూనియన్ నిలిచింది. ఆ తరువాత యూఎస్ 110 కోట్ల డోస్ లను ఆర్డర్ ఇచ్చింది. దేశాల్లోని జనాభా పరంగా చూస్తే, ఒక్క కెనడా మాత్రమే తమ దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్ ను అందించనుంది. జనాభాతో పోలిస్తే, అక్కడ ఐదు రెట్ల అధిక వ్యాక్సిన్ డోస్ లు సిద్ధమవుతున్నాయి.