మమత బెనర్జీపై విరుచుకుపడిన ఎంపీ రూపా గంగూలీ
- టీఎంసీ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతోంది
- నడ్డాపై దాడి చేసిన ఏడుగురి చరిత్రను పరిశీలించాలి
- సీపీఎం హయాంలోనూ ఇలాంటి నేరాలే జరిగాయి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ రాష్ట్రంలో టీఎంసీ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
దాడికి పాల్పడిన ఏడుగురు వ్యక్తుల చరిత్రను పరిశీలించాలని రూప కోరారు. నడ్డాపై దాడి చేసే శక్తి కేవలం ఏడుగురు వ్యక్తులకు ఉంటుందా? అని ప్రశ్నించారు. గతంలో బెంగాల్‌ను సీపీఎం పాలించినప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థీకృత నేరాలే జరిగాయని, ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు కూడా దీనిని ఫాలో అవుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులపై గతంలో టీఎంసీ కార్యకర్తలు దాడులకు దిగినా వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రూపా ఆగ్రహం వ్యక్తం చేశారు.