ఈ నెల 25 నుంచి ఏపీలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు: విజయసాయిరెడ్డి

  • బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది
  • జగన్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమం
  • 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్
కరోనా విజృంభణతో వణికిపోతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శుభవార్త తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆయన ప్రకటన చేశారు.

‘డిసెంబరు 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరుగుతుంది. కోటికి పైగా టెస్టులు నిర్వహించి వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రాష్ట్రం విజయం సాధించింది’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

ఏ వ్యాక్సిన్‌ను వేస్తారు? వంటి ఇతర విషయాలను విజయసాయిరెడ్డి తెలపలేదు. కాగా, త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇతర వివరాలు ఇప్పటివరకు రాలేదు. ఇంతలోనే విజయసాయిరెడ్డి ఏపీలో వ్యాక్సినేషన్‌పై ప్రకటన చేయడం గమనార్హం.


More Telugu News