కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్‌నూ వ్యాక్సిన్లు కట్టడి చేస్తాయి: జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి

  • బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం 
  • 70 శాతం వేగంగా వ్యాప్తి
  • ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్లు బ్రిటన్‌లో కొత్త వైరస్‌ను అడ్డుకుంటాయన్న జర్మనీ
బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు యూకే ఇప్పటికే తెలిపింది. ప్రస్తుతం కొవిడ్-19ని కట్టడి చేయడానికి అందుబాటులోకి తెస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఈ కొత్తరకం వైరస్‌కు అడ్డుకట్ట వేస్తుందని చెప్పలేమంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దీనిపై జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి యన్స్ స్ఫాన్ కీలక విషయాలు తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులోకి వస్తోన్న కరోనా వ్యాక్సిన్లు బ్రిటన్‌లో కొత్త వైరస్‌ను అడ్డుకుంటాయని తెలిపారు. ఐరోపా దేశాల నిపుణులు ఈ విషయాన్ని తెలుపుతున్నారని చెప్పారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటికే అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు కొత్త రకం కరోనాకు కూడా పనిచేస్తాయని ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ల ప్రభావంలో ఎటువంటి మార్పూ ఉండదని చెప్పారు. కాగా, కొత్తరకం వైరస్ కలకలం రేపుతుండడంతో బ్రిటన్‌కు పలుదేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి.  బ్రిటన్ ప్రజలను అనుమతించబోమంటూ ఫ్రాన్స్ కూడా చెబుతోంది.


More Telugu News