తెలంగాణలో తొలి విడతగా 40 వేల మందికి కరోనా వ్యాక్సిన్.. వివరాల సేకరణ

  • ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందిని గుర్తించిన అధికారులు
  • ఒక్కో కేంద్రంలో వందమందికి టీకా
  • మేడ్చల్‌లో 146, రంగారెడ్డిలో 60 కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కరోనా టీకా పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 40,095 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్య, ఐసీడీఎస్ సిబ్బందిని గుర్తించారు.

తొలి విడతలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ చేయనున్న అధికారులు ఆయా పీహెచ్‌సీలలో వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు వసతుల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందులో భాగంగా ఈ రెండు జిల్లాల్లో 65 డీప్ ఫ్రీజర్లు సమకూర్చనున్నారు. వ్యాక్సినేషన్ కోసం కనీసం మూడు గదులు ఉన్న భవనం అవసరం ఉంటుంది కాబట్టి ఆసుపత్రులు, స్కూళ్లు, సామాజిక భవనాలను గుర్తిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరుసగా 146, 60 కేంద్రాలను గుర్తించారు. ఒక్కో దాంట్లో వందమందికి టీకా ఇవ్వనున్నారు.


More Telugu News