కేరళలో వద్దు, బెంగాల్‌లో ముద్దు.. వామపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ!
- ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్
- పొత్తుకు సుముఖంగా వామపక్షాలు
- కేరళలో మాత్రం సీన్ రివర్స్
వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్ సై అంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ, బెంగాల్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వామపక్షాలతో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. మరోవైపు, కేరళలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండడం గమనార్హం. కాగా, బెంగాల్‌లో మమత ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీఎంసీకి చెందిన పలువురు నేతలను చేర్చుకుంటూ మమతను ఇరకాటంలోకి నెట్టేస్తోంది.